back

రాంచరణ్ - ఒక మంచి నిర్మాత



Share via:

కొణిదెల ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థని స్థాపించి తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కం బ్యాక్ మూవీ ఖైది నెం. 150 తో ఘన విజయాన్ని అందుకున్న నిర్మాత రామచరణ్. తనతో నటించిన నటులంతా కూడా రాంచరణ్ మంచి తనం గురించి , తను చూపించే ప్రేమ ఆప్యాయతల గురించి మాట్లాడుతుంటారు. అయితే ఇప్పుడు తన నిర్మాణ సంస్థ లో తీస్తున్న సైరా సినిమా యూనిట్ కూడా రాంచరణ్ ని పొగడ్తలతో మున్చేస్తున్నారు.

ఇంతకి విషయం ఏంటంటే .. అజర్బైజాన్ లో తన సినిమా షూటింగ్ ఐపోచేసుకున్న రాంచరణ్, తన నిర్మాణ సారధ్యంలో 200కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “సైరా నరసింహారెడ్డి” షూటింగ్ జరుగుతున్న జార్జియాకి వెళ్ళాడు. అక్కడ సైరా షూటింగ్ కి మధ్యలో ఒకరోజు బ్రేక్ ఇచ్చి సినిమా యూనిట్ లోని వారందరికీ షాపింగ్ చేసుకోమని డబ్బులు ఇచ్చి పంపాడట. దాంతో యూనిట్ సభ్యులంతా ఆనందంతో తమ నిర్మాత చాల మంచి వాడని పొగుడుతున్నారు.

ఎంతైనా రక్తంతో పాటు తండ్రి వచ్చిన తండ్రి మంచితనం, పెరుగుతూ నేర్చుకున్న బాబాయి నడవడిక ఎక్కడికిపోతాయి.

Tags : Mega Power Star, Ram Charan, Megastar, Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel