back

రాంచరణ్ సహాయంతో కోలుకున్న ధనుష్



Share via:

చిరంజీవి అభిమాన సంఘాల నాయాకుడు స్వామి నాయుడు గారు ఒక ఓపెన్ లెటర్ ద్వారా రామచరణ్ ఔదార్యం గురించి ఈ విధంగా వివరించారు......

లైవ్: నా పేరు సూర్య థాంక్స్ మీట్

“డియర్ మెగా ఫ్రెండ్స్,
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు తాలుకా అన్నదేవరపేట గ్రామంలో ఒక పేద బాలుడు ఎం.ధనుష్ తీవ్ర అనారోగ్యంతో ఎప్పటికి బాగుపడని రోగంతో ఎంతో బాధతో కుటుంబ సభ్యులుండగా....
అదే జిల్లాలో "రంగస్థలం" షూటింగ్ జరిగినప్పుడు నేను స్వయంగా ఈ కుటుంబాన్ని మెగా పవర్ స్టార్ శ్రీ రామ్ చరణ్ వద్దకు తీసుకువెళ్ళాను. వెంటనే రామ్ చరణ్ స్పందించి హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో చేర్పించి లక్షలాది రూపాయల ఖర్చుతో బాబుకి వైద్యం చేయిస్తువస్తున్నారు.

ఈ రోజు ధనుష్ అనే అబ్బాయి పూర్తిగా కోలుకుని మనలో ఒక మనిషిగా తిరగగలుగుతున్నాడు.
ప్రతీ నెలా చేయుంచి కొనే వైద్యపరీక్షల కొరకు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టుకు ఈరోజు ఉదయం వచ్చినప్పటి దృశ్యం”
అంటూ ఈ ఫోటో జత చేసారు ..

ram charan helped dhanush

Tags : Ram Charan, Dhanush, Mega Power Star, Rangasthalam

Write a comment ...
Post comment
Cancel