back

నా పేరు సూర్య కోసం రాంచరణ్ ...



Share via:

మొన్నటి వరకు ఏదో జరుగుతుంది మెగా ఫ్యామిలీ లో అనుకుంటున్న వాళ్ళందరికీ. ఇబ్బంది వస్తే మేమంతా ఒకటే అని మొన్న ఫిలిం ఛాంబర్ లో నిరూపించారు. మెగా ఫాన్స్ కి అల్లు ఫ్యామిలీ దూరం అవుతుంది అనే భావన కూడా రెండు రోజుల్లో పటాపంచలు అయింది.

ఆదివారం జరిగిన అల్లు అర్జున్ సినిమా నా పేరు సూర్య ఆడియో ఫంక్షన్ లో బన్నీ మాట్లాడుతూ “పవన్ ని ఏమైనా అంటే నేను తట్టుకోలేకపోయా” అని అనడం తోనే అన్ని సందేహాలు తేలిపోయాయి. ఇప్పుడు ఈ నేలకరున ఏప్రిల్ 29న జరిగే నా పేరు సూర్య ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి రాంచరణ్ ముఖ్య అతిధిగా రాబోతున్నాడు.. మరి ఆ ఈవెంట్ లో ప్రస్తుత విషయాల పైన ఇద్దరు ఎలా స్పందిస్తారో చూడాలి.

naa peru surya naa illu india pre release event

వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను లగడపాటి శ్రీధర్ - నాగబాబు సంయుక్తంగా నిర్మించారు. అను ఇమ్మన్యుయేల్ హీరోయిన్ గా నటించగా విశాల్ శేఖర్ సంగీతం అందించారు. మే 4న సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Tags : NSNI, Naa Peru Surya Naa Illu India Pre Release Event, Allu Arjun, Ram Charan

Write a comment ...
Post comment
Cancel