back

వైరల్ : రామ్ చరణ్ ఫస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్



Share via:

వైరల్ రామ్ చరణ్ తాజాగా ఇంస్టాగ్రామ్ లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. సెలెబ్రిటీలంతా ఇంస్టాగ్రామ్ లో ఉండటంతో చరణ్ కూడా ఇందులో ప్రవేశించడం విశేషంగా చెప్పవచ్చు. అకౌంట్ తీసుకున్న చాలా తక్కువ సమయంలో ఐదు లక్షల మంది రామ్ చరణ్ కు ఫాలోవర్స్ యాడ్ కావడం ఎంతో విశేషంగా చెప్పవచ్చు.

అదేవిధంగా రెండు రోజుల క్రితమే అకౌంట్ ఓపెన్ చేసిన చరణ్ ఈరోజు తన తొలి పోస్ట్ ను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ నెట్ లో వైరల్ గా మారి ఎంతో ఆకట్టుకుంది. తన తల్లితో ఉన్న ఫోటోను చరణ్ పోస్ట్ చేశాడు. ‘నా తొలి పోస్ట్ నీకోసమే అమ్మా..’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ క్యాప్షన్ అందరిని ఆకట్టుకుంది. చరణ్ పోస్ట్ ను దాదాపుగా 50 వేలమందికి పైగా లైక్ చేయడం విశేషం. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ప్రస్తుతం చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తూ.. సైరా నిర్మాతగా కూడా బిజీ అయిన విషయం తెలిసిందే.

View this post on Instagram

A post shared by Ram Charan (@alwaysramcharan) on

Tags : ramcharan, instagram, upasana

Write a comment ...
Post comment
Cancel