back

నిర్మాత, ఎగ్జిబిటర్లు బాగుంటేనే నాకు ఆనందం - రాంచరణ్



Share via:

తన ఒక్కడి గురించే కాక తన చుట్టూ అందరు బాగుండాలని అనుకోవడమే మానవత్వం. తనకి జీవనోపాధి కల్పిస్తున్న వాళ్ళు బాగుండాలని కోరుకోవడం ఒక కార్మికుడి ప్రాథమిక విధి. అలాగే సినిమాల్లో మనకి స్టార్స్ మరియు సూపర్ స్టార్స్ ఉన్న వాళ్ళందరికీ ఆ అవకాసం ఇచ్చిన నిర్మాతలు మరియు సినిమాను పంపినే చేసే పంపినిదారులు(డిస్ట్రిబ్యూటర్లు) ఆ తర్వాత ఎగ్జిబిటర్లు, వీళ్ళందరి వల్లనే సినిమాలు మన ముందుకు వస్తున్నాయి. సినిమాలు అపజయం పొందితే నష్టపోయేది వీళ్ళే.


ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే .. నిన్న వినయ విదేయ రామ ప్రచారంలో భాగంగా రాంచరణ్ ని రికార్డ్స్ గురించి ప్రశ్న వేసినప్పుడు తను ఇచ్చిన సమాధానం వలన ..అదేంటంటే .. “నేనైతే రికార్డుల గురించి పట్టించుకోను,నా సినిమా పోస్టర్లపై కలెక్షన్స్. & రికార్డులు వేయకండి అని నిర్మాతలకు చెప్పా. కాని అవి వేయాలో వద్దో నిర్ణయించుకావలసింది మాత్రం నిర్మాతలే. నా వరకు నా సినిమాకు నిర్మాతలు.. డిస్ట్రిబ్యూటర్లు లాభపడితే సంతోషిస్తానని.. అంతకు మించి  కలెక్షన్స్ విషయం ఆలోచించనని” తెలిపాడు.

ఫొటోస్: వినయ విధేయ రామ HD పోస్టర్స్

ఇలాగే అందరు హీరోలు ఆలోచిస్తే మాకు కష్టాలు తప్పుతాయి అంటున్నారు మిగతా నిర్మాతలు. ఎందుకంటే మన సినిమా ఇండస్ట్రీ సక్సెస్ రేట్ 10 శాతం లోపే .

Tags : Ram Charan , Vinaya Vidheya Rama

Write a comment ...
Post comment
Cancel