back

రాంచరణ్ ఏమి తింటున్నాడో తెలుసా..?



Share via:

ధ్రువ లో పవర్ఫుల్ పోలీస్ గా ఫిట్టెస్ట్ బాడీతో కనిపించిన రాంచరణ్ , తరువాత రంగస్థలం లో బాడీ ని కొంచం లూస్ చేసి బుగ్గలతో కనిపించాడు. ఇప్పుడు వినయ విదేయ రామ లో రెజ్లింగ్ చేసే మల్లయోదుల మాదిరు భారీ కాయంగా కనిపించాడు. మరి ఇలా బాడీ ని చేంజ్ చేసుకునే సమయంలో రాంచరణ్ ఎం తినేవాడు అనేది అందరికీ ఆసక్తి కలిగించే విషయం. ఈ విషయాన్ని గమనించిన ఉపాసన, తన భర్త డైట్ ప్లాన్ ని రిలీజ్ చేసింది. అదేంటంటే .

ఫొటోస్: వినయ విధేయ రామ HD పోస్టర్స్


“ఉదయం 8 గంటల నుంచి డైట్ ప్లాన్ అప్లయ్ చేయాలి. 8 ఏఎం 3 ఎగ్ వైట్స్ 2 పూర్తి  గుడ్లు దాంతో పాటే 3/4 కప్ ఓట్స్ ఆల్మండ్ మిల్క్ తో కలిపి తినాలి. 11.30ఏఎం ఒక పెద్ద కప్ తో వెజిటబుల్ సూప్ తాగాలి. 1.30 పీఎం కి లంచ్ చాలా సింపుల్ గా 200 గ్రాముల చికెన్ బ్రెస్ట్ 3/4 కప్ బ్రౌన్ రైస్+1/2 గ్రీన్ వెజిటబుల్ కర్రీ పుచ్చుకోవాలి. 4 పీఎం 250 గ్రాముల గ్రిల్డ్ ఫిష్ 200 గ్రాముల స్వీట్ పొటాటో 3/4 కప్ గ్రీన్ వెజిటబుల్స్ తీసుకోవాలి. 6పీఎం పెద్ద కప్ తో గ్రీన్ సలాడ్ 1/4 అవకాడో + గిన్నె నిండా నట్స్ (అక్రూట్ వగైరా పప్పులు) తినాలి. ఇంత తిన్నా చాలకపోతే పచ్చి వెజిటబుల్స్ అలాగే నట్స్ (రకరకాల పిక్కలు) మధ్య మధ్యలో తినాలి. సుగర్ ఫ్రూట్స్ రెడ్ మీట్ గోధుమలు కాఫీ డెయిరీ ఉత్పత్తులు వగైరా తినకూడదు. బిరియానీలు పచ్చళ్లు వగైరా నిషేధం. అలాగే సాయంత్రం 6 తర్వాత తిండి కట్. ప్రొటీన్ ఫుడ్ అంతా ఆవిరి పట్టినవి తినాలి. చేపలు బేక్ డ్ ఫుడ్స్ బాయిల్ చేసినవి .. ఆయిల్ లేకుండా తినాలి. బ్రౌన్ రైస్ ఓట్ మీల్స్ చిలగడ దుంపలు ఎర్రదుంపలు వంటివి ఎంచుకుని తినాలి.”

ఈ విధంగా సినిమా సినిమాకు తన శరీరంలో మార్పుల కోసం వ్యాయామమే కాక తనే విషయంలో కూడా ఖచ్చితత్వం పాటిస్తూ రాంచరణ్ తన ప్రత్యేకతను మరియు సినిమా పైన ప్రేమని చాటుకుంటున్నాడు.

Tags : Ram Charan Diet , Vinaya Vidheya Rama

Write a comment ...
Post comment
Cancel