back

వీక్ సాంగ్స్ ని కవర్ చేసేసిన రామచరణ్ - బోయపాటి



Share via:

రంగస్థలం తరువాత రాంచరణ్ తో పని చేస్తున్న దేవిశ్రీప్రసాద్ పాటల పైన అభిమానులకు చాలా అంచనాలు ఉండగా, వారిని నిరుత్సాహపరిచే పాటలు ఇచ్చాడు దేవి. అయితే ఈ సినిమా ‘వినయ విదేయ రామ’ సినిమాలోని ఒక్కో పాట వీడియో ప్రోమొలను సినిమా యూనిట్ ధఫధఫాలగా విడుదల చేస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫ్యామిలీ సాంగ్ ‘తందానే తందానే’ మరియు ‘తస్సాదియ్యా’ ప్రోమోలు సినిమా మీద హైప్ ని పెంచగా, సినిమా మ్యూజిక్ ఆల్బమ్ లోనే బెస్ట్ సాంగ్ గా చెప్పుకోదగిన సాంగ్ “రాం లవ్స్ సీత” వీడియో ప్రోమోని నిన్న రిలీజ్ చేసారు సినిమా యూనిట్.


ఈ వీడియో ప్రోమోలు చూసాక పాటలు రొటీన్ గా ఉన్నా బోయపాటి మార్కు గ్రాండ్ సెట్స్ అండ్ సెటప్ కి రాంచరణ్ స్టెప్స్ తోడై ఈ పాటలను సూపర్ హిట్ అనిపిస్తున్నాయి. ఈ ‘రాం లవ్స్ సీత’ పాటనే చూస్తే ట్యూన్ రొటీనే గానీ కలర్ ఫుల్  పంజాబీ భాంగ్రా స్టైల్ సాంగ్ కావడంతో వందలకొద్దీ డ్యాన్సర్లు కలర్ఫుల్ డ్రెస్సుల్లో డ్యాన్స్ చేస్తుంటే చరణ్ - కియారా జోడీ ఉత్సాహంగా వారిని లీడ్ చేశారు. కోరియోగ్రఫీ కూడా సూపర్ గా ఉండడంతో చరణ్ డాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.  ఒవరాల్ గా ఒక సాధారణ్ ట్యూన్ ను చరణ్ ఫుల్ గా కవరప్ చేశాడు.

  

ఫొటోస్: వినయ విధేయ రామ HD పోస్టర్స్

Tags : Ram charan, VVR, Boyapati Sreenu, Devi Sri Prasad

Write a comment ...
Post comment
Cancel