back

రామ్‌చరణ్ భార్య ఉపాసనకు దాదాసాహెబ్ పురస్కారంShare via:

రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల 'బి పాజిటివ్- హెల్త్ అండ్ లైఫ్ట్‌స్టైల్’ మ్యాగజైన్‌కు చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉపాసన ఖాళీ సమయాల్లో సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటారు. సమస్యలపై ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో స్పందిస్తూ స్ఫూర్తినిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే సామాజిక సేవ కేటగిరీలో ‘ ఈ ఏటి మేటి పరోపకారి’గా దాదాసాహెబ్ పురస్కారం అందుకున్నారు ఉపాసన.

దాదాసాహెబ్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్స్ సంస్థ ఈ అవార్డును శనివారం ఉపాసనకు అందించింది. అపోలో ఫౌండేషన్ ద్వారా ఆమె అందిస్తున్న సేవలను గుర్తించిన సంస్థ ఈ పురస్కారంతో సత్కరించింది. విభిన్న రంగాల్లో రాణిస్తూ ఇతరులకు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్న వ్యక్తులను ఈ అవార్డుకు ఎంపికి చేస్తుంటారు

ఉపాసనకు అవార్డు రావడం పట్ల రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలిపారు

Tags : Upasana, Dadasaheb Phalke Award, Ram Charan

Write a comment ...
Post comment
Cancel