back

మెగాస్టార్ నే ఛాలెంజ్ చేసిన రాంచరణ్



Share via:

‘హమ్ ఫిట్‌ తో ఇండియా ఫిట్’ పేరుతో కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ప్రారంభించిన ఈ ఛాలెంజ్ పైన చాలా మంది సినీ ప్రముఖులు సానుకూలంగా స్పందిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ మలయాళం నటుడు మోహన్ లాల్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ వర్క్ అవుట్ చేస్తున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి.. మహేష్ బాబు, నందమూరి కల్యాణ్ రామ్, రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివకు ఛాలెంజ్ విసిరారు.

ఎన్టీఆర్ ఫిట్నెస్ సవాల్ ను.. చరణ్ యాక్సెప్ట్ చేశాడు. తను బాక్సింగ్ చేస్తున్న వీడియోను మెగా పవర్ స్టార్ పోస్ట్ చేశాడు. ఇందులో ఫుల్ స్పీడ్ లో తెగ బాక్సింగ్ చేసేస్తున్నాడు చెర్రీ. దానితో పాటు తను కూడా కొందరికి ఈ ఛాలెంజ్ విసిరాడు, అందులో ఆశ్చర్యం ఏంటంటే తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కుడా ఆ లిస్ట్లో ఉండడమే. మరి చరణ్ ఛాలెంజ్ ని స్వీకరించి చిరంజీవి కూడా ఇలాంటి పోస్ట్ ఏమైనా చేస్తాడ అనేది చూడాలి.

చరణ్ ఛాలెంజ్ ..‘‘హాయ్ ..జూ.ఎన్టిఆర్, నీ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నాను. అంతేకాదు నేను కూడా సుకుమార్, కేటీఆర్, అబు జానీ సందీప్ కోస్లా, శోభన కామినేని, వరుణ్ తేజ్ మరియు మన మెగాస్టార్‌కు ఈ ఛాలెంజ్ విసురుతున్నాను..’’

Tags : Ram Charan, Megastar Chiranjeevi, Hum Fit Toh India Fit

Write a comment ...
Post comment
Cancel