back

త్వరలో విడుదల అవనున్న చరణ్ కొత్త సినిమా పేరు...



Share via:

రంగస్థలం సినిమా ఘన విజయం తరువాత రాంచరణ్ తీస్తున్న సినిమా పైన అభిమానుల్లోనే కాక సామాన్య సిని జనాలలో కూడా బాగా ఆసక్తి ఉంది. బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్ ధ్రువ, రంగస్థలం సినిమాలలో తన ఆక్టింగ్ తో అదరగొట్టిన రాంచరణ్ ని ఎలా చూపించబోతున్నాడు అనేది ఈ ఆసక్తిని ఇంకా పెంచుతోంది. అందులోనూ ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్, శ్రీకాంత్, ప్రశాంత్, స్నేహ మొదలగు భారీ తారాగణం ఉండడంతో ఈ సినిమా అంచనాలు పెరుగుతున్నాయి.

ఈ మధ్యనే బ్యాంకాక్ లో షూటింగ్ ఐపోచేసుకుని వచ్చిన సినిమా యూనిట్ జూన్ 12 న మొదలవనున్న షెడ్యూల్ తో ముఖ్య భాగం షూటింగ్ ని పూర్తి చేసుకోనుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా టైటిల్ పైన చాలా పుకార్లు వస్తున్నాయి, వీటికి పుల్ స్టాప్ పెడుతూ త్వరలో సినిమా పేరు ని అనౌన్సు చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ డి.వి.వి. ఎంటర్టైన్మెంట్ వర్గాలు తెలిపాయి.

Tags : Ram Charan Next Movie, Ram Charan- Boyapati Movie, RC12 Updates, RC12 Title, Ram Charan - Boyapati Srinu Movie Title Announcement

Write a comment ...
Post comment
Cancel