back

రాంచరణ్ - బోయపాటి సినిమా కొత్త షెడ్యూల్



Share via:

రంగస్థలం తర్వాత రాంచరణ్ తో బోయపాటి తీస్తున్న పక్కా ఫ్యామిలీ - మాస్ సినిమా, పోయిన నెలలో బ్యాంకాక్ లో ఆక్షన్ సన్నివేశాలు పూర్తి చేసుకుని ఈ రోజు నుంచి కొత్త షెడ్యూల్ లోకి ఎంటర్ అవుతున్నది. ఈ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ ఉంది. చరణ్ మాత్రమే కాకుండా.. ప్రశాంత్, స్నేహ, నవీన్ చంద్ర లాంటి నటీనటులున్నారు. వీళ్లందరితో కలిసున్న ఫ్యామిలీ సన్నివేశాల్ని ఈ రోజు నుంచి షూట్ చేయబోతున్నారు. 2 వారాల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది. ఆ తర్వాత యూనిట్ అంతా కలిసి 2 పాటల షూటింగ్ కోసం యూరోప్ వెళ్తుంది.

బోయపాటి కోసం చొక్కా విప్పనున్న రాంచరణ్

ఈ సినిమాని దసరా బరిలో నిలపాలని ఈ చిత్ర యూనిట్ పనిచేస్తుంది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. త్వరలోనే టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు. రాంచరణ్ కి జంటగా కైరా అద్వాని చేస్తుండగా ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

రాంచరణ్ మంచి భర్త అంటున్న ఉపాసన

Tags : Ram Charan, Mega Power Star, Boyapati Srinu Movie, RC12

Write a comment ...
Post comment
Cancel