back

రామ్ చరణ్ బర్త్ డే విశేషాలు...



Share via:

నిన్న రామ్ చరణ్ తన పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. అభిమానులు అతడి కోసం రక్తదానం చేసారు. సెలబ్రిటీలు వరుసగా ట్వీట్స్ పెట్టారు . మరి అంత హంగామా మధ్య రామ్ చరణ్ ఏం చేసాడంటే...
ఉదయాన్నే తన ఫ్యామిలీ చిరంజీవి, సురేఖ, ఉపాసన గార్లతో మరియు ఇతర కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేశాడు చరణ్. ఆ వెంటనే అభిమానుల సమక్షంలో మరో కేక్ కట్ చేశాడు. తర్వాత అట్నుంచి అటే రంగస్థలం టీమ్ తో భేటీ అయ్యాడు.

రంగస్థలం యూనిట్ మధ్య మరో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. సినిమా అవుట్ పుట్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న చరణ్, తన ఆనందాన్ని యూనిట్ తో పంచుకున్నాడు. అంతేకాదు.. సినిమాలో కీలకమైన ముగ్గురు కి ఊహించని బహుమతులు అందించాడు. చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఇలా ఊహించని బహుమతులు అందుకున్న వాళ్లంతా ఉబ్బితబ్బిబ్బయ్యారు.

ఇక అభిమానులు, ప్రేక్షకుల కోసం చెర్రీ బర్త్ డే కానుకగా నిన్న సాయంత్రం రంగస్థలం సినిమా నుంచి జిగేలు రాణి సాంగ్ వీడియోను విడుదల చేసారు. హాట్ హీరోయిన్ పూజాహెగ్డే ఈ ఐటెంసాంగ్ లో డాన్స్ చేసింది. పుట్టినరోజు సందర్భంగా నిన్న రంగస్థలం ప్రచారాన్ని పక్కనపెట్టాడు చరణ్. పూర్తిగా కుటుంబ సభ్యులు, అభిమానులకే సమయం కేటాయించాడు.

ఇంకో గొప్ప విషయం ఏంటంటే .. బాబాయ్ పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి చెర్రీకి విషెస్ అందిచాడు.అలగే అందరు కలిసి లంచ్ చేసి, కాసేపు గడిపారు.

అలా నిన్న రామ్ చరణ్ తన పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నారు.

Tags : Ram Charan Birthday Celebrations, Mega Power Star, Happy Birthday Ram Charan, Megastar Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel