back

సంక్రాంతికి మెగా - నందమూరి వార్ ..?



Share via:

2017 సంక్రాంతి కి 10 సంవత్సరాల తర్వాత కంబ్యాక్ సినిమాగా ఖైది నెం 150 తో మెగాస్టార్ చిరంజీవి, తెలుగు మహారాజు గౌతమీపుత్ర శాతకర్ణి గా నందమూరి బాలక్రిష్ణ పోటీ పడ్డారు. రెండు సినిమాలు విజయం సాధించగా చిరంజీవి సినిమానే 100 కోట్ల వసూళ్లతో పెద్ద విజయం సాధించింది. ఇక ఇప్పుడు 2019 లో సంక్రాంతికి మెగా పవర్ స్టార్ రాంచరణ్-బోయపాటి ల సినిమా బాలక్రిష్ణ బయోపిక్ ఎన్టీఆర్ తో పోటి పడనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే ఈ సంక్రాంతి పోటీ పైన ఇండస్ట్రీ ఓకే క్లారిటీ తో ఉంది అదేంటంటే రామ్ చరణ్ చేస్తున్న మూవీ జనవరి 11న, క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కే ఎన్టీఆర్ బయోపిక్ జనవరి 12న రిలీజవుతుంది అని. అలాగే పండగ రోజున విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ కలిసి నటించే మల్టీస్టారర్ మూవీ ఎఫ్2 ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హట్రిక్ హిట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ వార్తలు ఎంత వరకు నిజం అవుతాయి అనేది కాలమే నిర్ణయిస్తుంది.

Tags : Mega Power Star, Ram Charan, Nandamuri Balakrishna, Sankranti 2019

Write a comment ...
Post comment
Cancel