back

రాంచరణ్ కి జోడిగా శ్రీదేవి కూతురు ..



Share via:

ఈ టైటిల్ మనం చాలా సార్లు విన్నాం, శ్రీదేవి తన కూతురు జహ్నవిని హీరోయిన్ చేయాలనీ అనుకున్నప్పటి నుంచి కూడా ఇలాంటి టైటిల్ని మనం ఎక్కడో ఒక దగ్గర చూసి ఉంటాం.

ఇప్పటికీ జగదేకవీరుడు అతిలోక సుందరి రీమేక్ గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఆ మధ్యలో నిర్మాత అశ్వినిదత్ కూడా రామ్ చరణ్ - జాహ్నవి రెడీ అంటే 'జగదేకవీరుడు అతిలోక సుందరి'కి సీక్వెల్ తీస్తాం అని ప్రకటించారు. కాని జాహ్నవి ‘ధడక్’ అనే హిందీ సినిమాతో తొలి సినిమా చేసి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇప్పుడు మళ్ళి రామ్ చరణ్ తో జాహ్నవి జోడి కట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి, కాని ఇదైతే పాత విషయం కానే కాదు. రాజమౌళి తీయబోయే RRR సినిమాలో రామ్ చరణ్ జోడిగా జాహ్నవిని తీసుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

బాహుబలిలో శ్రీదేవిని తీసుకోవాలి అనుకుని ఆర్ధిక విషయంతో తీసుకోలేదు అని చెప్పి రాజమౌళి శ్రీదేవిని బాగా హర్ట్ చేసారు, ఆ తర్వాత సారీ చెప్పారు లెండి, కాని ఇప్పుడు శ్రీదేవి కూతురికి ఈ భారి బడ్జెట్ సినిమాలో ఛాన్స్ ఇచ్చి ఆ తప్పుని సరిచేసుకోవాలని అనుకున్నాడేమో జక్కన్న. చూద్దాం మరి ఈ జోడి ఎలాంటి మాయ చేస్తుందో...

Tags : Ram Charan, Jhanvi Kapoor, RRR Movie

Write a comment ...
Post comment
Cancel