back

అభిమానుల కోసం చరణ్ ..చరణ్ కోసం అభిమానులు ..Share via:

మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులతో చాల సన్నిహితంగా మెలిగే వారు. ఎప్పుడు కుడా వాళ్ళు బాగుండాలని కోరుకునేవారు. చాలా మంది అభిమానుల ఇంట్లో జరిగిన ఫంక్షన్లకు కూడా ఆయన హాజారయ్యారు, థర్వ్కథి కాలంలో తన తరపున నాగబాబు ని పంపించేవారు. ఇప్పుడు అదే మెగా వారసత్వాన్ని స్వీకరించిన రామ్ చరణ్ కూడా ఫాలో అవుతున్నాడు. అభిమానులతో ఎంతో ఓపికగా ముచ్చటించడం మరియు ఎందరు వచ్చిన వాళ్ళతో ఫొటోస్ దిగడం రాంచరణ్ దినచర్య. ఇప్పుడు ఉన్న హీరోలలో ఇంత ఓపిక మరియు అభిమానుల పైన ప్రేమ ఉన్న హీరో ఇంకెవ్వరు లేరు.

మరి మెగా అభిమానులు కూడా తక్కువ వాళ్ళు కాదు, ఎప్పుడు ఏదో ఒక సేవ కార్యక్రమం చేస్తూ అందరితో శభాష్ అనిపించుకోవడం వీళ్ళకి అలవాటు. మెగా ఫ్యామిలీ సినిమాలు రిలీజ్ అప్పుడు హంగామా చేసే ఈ అభిమానులు ఇప్పుడు కొత్తగా బైక్ ర్యాలీ ప్లాన్ చేసారు. బోయపాటి దర్శకత్వంలో రాబోతున్న వినయ విధేయ రాముడైన రామ్ చరణ్ కోసం అఖిల భారత చిరంజీవి యువత, కడప జిల్లా చిరంజీవి యువత కలిసి డిసెంబర్ 6వ తేదీన బైక్ ర్యాలీ చేయబోతోంది.

ఈ విధంగా అభిమానులు మరియు హీరోలు ఒకరిని ఒకరు గౌరవించుకోవడం మంచి పరిణామం.

Tags : Ram Charan, Mega Fans

Write a comment ...
Post comment
Cancel