back

రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్ లో రాజశేఖర్!



Share via:

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం ఎట్టకేలకు రాజమౌళి ప్రకటించేసాడు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, చరణ్‌లు హీరోలుగా నటించబోతున్న మల్టీస్టారర్‌కు ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది. దినిని dvv దానయ్య నిర్మిస్తున్న విషయం కూడా తెలుసు.మెగా, నందమూరి కాంబో మూవీ అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇక రాజమౌళి సినిమా అంటే విలన్‌ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాడనే విషయం మన అందరికి తెలిసిందే. ‘బాహుబలి’ చిత్రంలో రానా విలన్‌గా నటించి గొప్ప పేరు తెచ్చుకోవడం మనం చూసాం. ఇక జక్కన్న మల్టీస్టారర్‌లో విలన్‌ ఎవరై ఉంటారా అని గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో విలన్‌గా రాజశేఖర్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉందని సమాచారం.

రాజశేఖర్‌కు గత కొంత కాలం గ్యాప్ తీసుకోని ఈ మధ్యే గరుడ వేగాతో మంచి హిట్ కొట్టాడు. అయితే మంచి కథతో వస్తే విలన్‌ పాత్ర చేయడానికి రెడీ అంటూ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది.అది విన్నాడో ఏమో రాజమౌళి.. విలన్‌ పాత్ర కోసం సంప్రదించగానే కనీసం కథ కూడా పూర్తిగా వినకుండా తన పాత్ర ఏంటో చెప్పమని ఓకే చెప్పేశాడట రాజ శేఖర్.

చరణ్‌, ఎన్టీఆర్‌ ల కు తోడు సీనియర్ నటుడు అయిన రాజశేఖర్ కూడా కలవడంతో సినిమా మరింత సంచలనాత్మకంగా మారింది.ఈ సినిమా అంచనాలు బారి స్థాయిలో ఉండబోతుంది అనడం లో ఎటువంటి సందేహం లేదు.

#RRR లో రాజశేఖర్ పాత్ర గురించి జీవిత ఏమందంటే...

Tags : RRR Movie, Ram Charan Multistarrer, Ram Charan - NTR Film, Ram Charan - NTR - Rajamouli film, Rajasekhar in #RRR

Write a comment ...
Post comment
Cancel