back

రంగస్థలం పై... రాజమౌళి ట్విట్



Share via:

ఇటీవల విడుదలైన రంగస్థలం చిత్రం భారీ కలెక్షన్లతో ముందుకు దూసుకుపోతున్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే రికార్డు కలెక్షన్స్ తో కొత్త రికార్డులు నమోదు చేసింది. ఇంకా అదే జోష్ లో ముందుకు దుసుకేల్తుంది. ఈ సినిమా విడుదలైన నాటి నుండి సినీ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో రాంచరణ్ నటనకు అందరూ ముగ్ధులు అయిపోయారు.

రంగస్థలం 8 Days కలెక్షన్స్

అయితే ప్రముఖ దర్శకుడు రాజమౌళి రీసెంట్ గా ఈ సినిమా చూడగా... ఇవాళ ఉదయం ట్వీట్ చేసి ప్రశంసించారు. రంగస్థలం సినిమాలో చాలా గొప్ప విషయాలు దాగి ఉన్నాయి... ముఖ్యంగా సినిమాలో చిట్టి బాబు పాత్ర ను సుకుమార్ మలిచిన విధానం, చిట్టిబాబు పాత్రలో రాంచరణ్ నటన మైమరపించేల చేశాయని.. నెమ్మదిగా యాసతో కూడిన మాటలు పలుకుతూ నటించిన జగపతి బాబు అద‍్భుతంగ చేసడంటూ పొగిడారు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్‌ కి, అలాగే సుకుమార్‌ కి ఇతర యూనిట్‌ సభ్యులకు శుభాకాంక్షలు’ అంటూ రాజమౌళి ట్వీట్ చేయడం జరిగింది.

Tags : rajamouli tweet on rangasthalam, rangasthalam movie, rajamouli praises ramcharan, rajamouli best wishes for rangasthalam

Write a comment ...
Post comment
Cancel