back

#RRR కి కాస్టింగ్ హంట్ లో రాజమౌళి...



Share via:

రామ్ చరణ్ - ఎన్.టి.ఆర్ లతో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తీయబోతున్న మల్టిస్టారర్ సినిమా కోసం సినీ అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య సినిమా షూటింగ్ ఆలస్యం పైన వచ్చిన కొన్ని పుకార్లు అందరిని నిరాశపరచగా, రాజమౌళి మాత్రం తన పని తను చేసుకుంటూ పోతున్నాడు.

ఈ సినిమా విషయంలో ఇప్పుడు ఎం జరుగుతోందంటే - బోలెడు మంది జూనియర్ ఆర్టిస్టులను 'రిక్రూట్' చేసుకునే కార్యక్రమం. జూనియర్ ఆర్టిస్ట్ సప్లయిర్స్ ద్వారా, తెలిసిన వారి ద్వారా జనాల్లోకి స్మూత్ గా మెసేజ్ పంపి, బోలెడు మందిని ఈ మధ్య రప్పించారట. వాళ్లకు టెస్ట్ లు, పలకరింపులు, ఇతరత్రా వ్యవహారాలన్నీ రాజమౌళి టీమ్ నిర్వహించింది. నిర్వహిస్తోంది. వీళ్లంతా సినిమాలో కనిపించే వివిధ రకాల చోటా, మోటా పాత్రల కోసం సెలెక్ట్ చేసిన తర్వాత రిహార్స్ లు, ట్రయినింగ్ వుంటుందట.

వీటన్నిటి పిమ్మట హీరోలు మరియు ముఖ్య తారాగణంతో కూడా ఒక నెల పాటు రిహార్సల్స్ చేపించి ఆ తర్వాతే అసలు విషయం మొదలవుతుంది అంటున్నారు. ఈ లెక్కన వచ్చే జనువరీలో షూటింగ్ మొదలెట్టి 2019 లో సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

Tags : #RRR Casting Hunt, SS Rajamouli, Ram Charan, NTR

Write a comment ...
Post comment
Cancel