back

12-12-12 రాజమౌళి నుంచి RRR గురించి మరో వార్త రానుందా?



Share via:

11-11-11 అంటూ 11 వ నెల 11 వ తేది 11 గంటలకు RRR సినిమా ముహూర్త కార్యక్రమము జరిపాడు రాజమౌళి. సినిమా మొదులు పెట్టినప్పటి నుంచి దాన్ని ప్రమోట్ చేయడంలో రాజమౌళిని మించిన వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. అందులో భాగంగా ఆయన డిసెంబర్ 12 వ తేదిన 12 గంటలకు సినిమాకి సంబంధించి కొత్త వార్త ఒకటి చెప్పనున్నారు అనేది ఇండస్ట్రీ టాక్.

మరి ఆ వార్త ఏమైన్దచ్చు అని చర్చలు చేస్తున్న సినిమా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు, అదే చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్స్ ను ప్రకటించే అవకాసం ఉంది అని. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ అని - ఒక హీరోయిన్ గా కీర్తి సురేష్ ఎంపిక అయ్యిందని ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. డిసెంబర్ 12న హీరోయిన్స్ ను రివీల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి అది కాక ఇంకేమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసాడా రాజమౌళి అనేది చూడాలి.

ఇక రామచరణ్ - ఎన్టీఅర్ ల మధ్య ఫైట్ సీన్ తో మొదలైన ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ డిసెంబర్ 3 తో ముగియనుంది. ఆ వెంటనే రాంచరణ్ ‘వినయ విదేయ రామ’ లోని చివరి పాట షూటింగ్ కి షిఫ్ట్ అవుతాడు.

Tags : Rajamouli, RRR, Jr NTR, Ram Charan

Write a comment ...
Post comment
Cancel