back

RRR అంచనాలు మిన్చుతుందంటున్న నిర్మాత దానయ్య ..



Share via:

నవంబర్ 11న జరిగిన RRR సినిమా ప్రారంబోత్సవం లో అంతా తానై చూసుకున్న చిత్ర నిర్మాత డి.వి.వి. దానయ్య ఆ తరువాత మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఆయన ఏమన్నారంటే ..

‘‘మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఆఫ్ టాలీవుడ్ను మా బ్యానర్లో రామచరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్స్తో.. తెలుగు సినిమా సత్తాను బాహుబలితో ప్రపంచానికి చాటిన ఎస్.ఎస్.రాజమౌళిగారి దర్శకత్వంలో చేయడం ఓ డ్రీమ్లాగా ఉంది. సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలున్నాయి. నందమూరి అభిమానులు, మెగాభిమానులు సినిమా కోసం ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో నాకు తెలుసు. అందరి అంచనాలను మించేలా మేకింగ్లో కాంప్రమైజ్ కాకుండా .. తెలుగు సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటేంత గొప్ప సాంకేతిక విలువలతో సినిమాను భారీగా రూపొందిస్తాను. అన్ కాంప్రమైజ్డ్గా చేయబోయే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 19 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎన్టీఆర్, రామ్చరణ్ కాంబినేషన్లో భారీ సెట్లో రెండు వారాల పాటు ఈ యాక్షన్ ఏపిసోడ్ను తెరకెక్కించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాలో చేయబోయే మిగతా నటీనటులు వివరాలను ప్రకటిస్తాం..’’ అన్నారు.

Tags : RRR, Rajmouli, Ram Charan, Jr NTR, Dannayya

Write a comment ...
Post comment
Cancel