back

మంచి టిఆర్పి సాధించిన చిత్రంగా ప్రతిరోజు పండగే



Share via:

సాయి ధరమ్ తేజ్ చాలా రోజుల తర్వాత ప్రతిరోజు పండగే చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. దర్శకుడు మారుతీ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ భారీ వసూళ్లు అందుకుంది. ప్రతిరోజు పండగే ధరమ్ తేజ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఊహకు మించిన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. కాగా ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ స్టార్ మా దక్కించుకుంది.

ఇటీవల స్టార్ మా ఛానల్ లో ఈ చిత్రం ప్రసారం కాగా భారీ టీఆర్పీ దక్కించుకుంది. ఈ మూవీకి ఏకంగా 15.3 టీఆర్పీ రేటింగ్ రావడం విశేషం. ధరమ్ గత చిత్రాలలో బెస్ట్ రేటింగ్ కావడంతో పాటు, ఈ మధ్య కాలంలో మంచి టిఆర్పి సాధించిన చిత్రంగా ప్రతిరోజు పండగే నిలిచింది. గీతాఆర్ట్స్2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించగా, రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Tags : Sai dharam tej, Prati roju pandage, Mega family

Write a comment ...
Post comment
Cancel