back

పలాస ఎం.ఎల్.ఎ అల్లుడికి జిఎస్టి కట్టాలా... పవన్



Share via:

జన పోరాట యాత్ర లో భాగంగా ఉత్తరాంధ్ర లో యాత్ర చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్, పలాస నియోజకవర్గం కాశిబుగ్గ లో మాట్లాడుతున్న తరుణంలో అక్కడికి వచ్చిన జన సందోహాన్ని ఉద్దేశిస్తూ “ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో పన్నులు కడుతున్న ప్రజలు.. పలాసలో ఎమ్మెల్యే అల్లుడికి వ్యాపారులు జీఎస్టీ చెల్లించాల్సి వస్తోందంటూ మండిపడ్డారు. ఇలాంటి వాటిపై ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. టీడీపీ సర్కారులో భూకబ్జాలు ఎక్కువయ్యాయని చెప్పిన పవన్.. పలాసాలో భూకబ్జాలు ఇటీవల కాలంలో భారీగా పెరిగిపోయిన వైనాన్ని ప్రస్తావించారు”. పవన్ నోటి నుంచి స్థానిక ఎమ్మెల్యే అల్లుడి ప్రస్తావన వచ్చినప్పుడు.. సభకు హాజరైన ప్రజల్లో విశేష స్పందన రావటం గమనార్హం.

Tags : JanaSena Party, Pawan Kalyan, GST, Palasa MLA

Write a comment ...
Post comment
Cancel