back

నాలుగు నెలలు దీక్ష చేప్పట్టిన పవన్ కళ్యాణ్ !



Share via:

దేశ ప్రజల క్షేమాన్నిముఖ్యంగా తెలుగు ప్రజలకు ఆరోగ్యం, ఆర్దిక శ్రేయస్సును కాంక్షిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారు చాతుర్మాస్య దీక్షను చేపట్టారు.నేడు తొలి ఏకాదశి.శుభప్రదమైన పుణ్య దినం కావడంతో పాటు శాస్త్ర ప్రకారం ఆషాడ శుక్ల ఏకాదశి నాడు దీక్ష ప్రారంభించి కార్తీక శుక్ల ఏకాదశినాడు పూర్ణాహుతితో దీక్ష విరమించవలసి ఉంటుంది.నేడు తొలి ఏకాదశి.శుభప్రదమైన పుణ్య దినం కావడంతో ఈ రోజు దీక్షను ప్రారంభించారు. ఆషాడం,శ్రావణం, భాద్రపదం, ఆశ్వీఇజమాసం కలిపి నాలుగు మాసాలపాటు ఈ దీక్ష కొనసాగుతుంది. దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఈ దీక్షను శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారు ఆచరిస్తూనే వున్నారు. దీక్ష కాలంలో నిర్దేశించిన ఆచార వ్యవహారాల ప్రకారం పూజతోపాటు అనుష్టానాన్ని అర్పించి నిర్దేశిత ఆచార వ్యవహారాల ప్రకారం ఒంటిపూట, అది సంధ్యాకాలం ముగిసిన తరువాత కొద్దిగా పాల్కుపండ్లను కొంచెం సాత్వికాహారం ఒక పూట మాత్రమే తీసుకుంటారు.

కరోనా పట్టి పీడిస్తున్నతరుణంలో ప్రజలు ఆర్టికంగా, మానసికంగా నలిగిపోతున్నారు. కుల వృత్తులను నమ్ముకుని జీవిస్తున్నవారు,ఉపాధ్యాయులు,స్వర్ణ +నేత, కార్మిక కళాకారులు,ఫొటో గ్రాఫర్లు,రోడ్‌ పక్కన చిరు వ్యాపారం చేసుకునేవారు,రైతులు,కార్మికులు,ప్రెవేట్‌ ఉద్యోగులు ఇలా అనేక మంది ఉపాధి కోల్పోయి అల్లాడిపోతున్నారు. ఇటువంటి దుర్భర పరిస్థితుల నుంచి ప్రజలు బయటపడి సాధారణ జీవనం సాగించాలని,వారికి శారీరక, మానసిక ఆరోగ్యం అందించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఈసారి ఈ దీక్ష చేపట్టినట్లు శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారు తెలిపారు

Tags : Pawan Kalyan, Deeksha ,Corona Virus, Covid 19

Write a comment ...
Post comment
Cancel