back

ఉత్తరప్రదేశ్ లో పవన్ ఏం చేస్తున్నాడు...



Share via:

15 వ తేదీన ధవళేశ్వరం బ్రిడ్గి పైన కవాతు తర్వాత వారం పాటు శ్రీకాకుళం లోని తితిలి తుఫాను భాదిత ప్రాంతాల్లో పర్యటించిన జనసేనాని పవన్ కళ్యాణ్, ఉన్నట్లుంది ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో లో ప్రత్యక్ష్యం అయ్యారు. నాదెండ్ల మనోహర్, తోట చంద్రశేకర్ మరి కొద్ది నాయకులతో పాటు ఉస్మానియా విద్యార్థులను కూడా తనతో తీసుకెళ్ళాడు పవన్.

ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ తో జనసేన పొత్తు గురించే అని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. జాతీయ పార్టీ అయిన బిఎస్పి అధినేత మాయావతిని కాని లేక వారి తరపున ముఖ్య నేతలని కలిసి పొత్తుని ఖరారు చేయబోతున్నారని సర్వత్రా వినిపిస్తున్న మాటలు. మరి నిన్న ఏనుగుల పార్క్ గా పేరు గాంచిన లక్నోలోని అంబేద్కర్ మెమోరియల్ పార్క్ సందర్శించిన పవన్ ఈ విషయం పైన ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి.

Tags : Pawan Kalyan, Uttar Pradesh, Janasena Party, Manohar

Write a comment ...
Post comment
Cancel