back

పవన్ సరదాగా నా ప్యాంట తో ఆదుకున్నాడు - రవితేజ



Share via:

రవితేజ హీరోగా నటించిన నేలటిక్కెట్టు సినిమా ఆడియో ఫంక్షన్ కు పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. రవితేజ, పవన్ కలిసి సరదాగా చాలాసేపు మాట్లాడుకున్నారు. ఈ స్టిల్స్ అన్నీ అప్పట్లో వైరల్ అయ్యాయి. వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి పవన్ , రవితేజ ఆ ఎవెంట్లోనే చెప్పేసారు. ఇకపోతే రవితేజ వేసుకున్న జీన్స్ ప్యాంట్ కు చిన్న చిన్న రంధ్రాలు (టోన్డ్ జీన్) ఉంటే.. అందులో పవన్ వేలు పెట్టి కెలికిన స్టిల్/వీడియో బాగా వైరల్ అవ్వడమే కాకుండా.. పవన్ పై అప్పట్లో ట్రోలింగ్ కూడా అయింది. దీనిపై రవితేజ తనదైన స్టయిల్ లో వివరణ ఇచ్చాడు.

"పవన్ నా ప్యాంట్ తో ఆడుకోవడంపై ట్రోల్ అయింది. అది నా ప్యాంట్ బొక్కలో వేలు పెట్టడం కాదు. అదేదో సరదా కోసం అలా చేశాడు. ఆరోజు నేను టోన్డ్ జీన్స్ వేసుకున్నాను కదా. అది పవన్ ను ఎట్రాక్ట్ చేసింది. దాన్ని పట్టుకుని లాగుతుంటే ఫొటో తీసి ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. పోన్లేండి ఎవరు ఎలా అనుకుంటే అలా అనుకోనివ్వండి."

పవన్ చాలా సరదా మనిషని, ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉంటాడని, అతడు చేసే అలాంటి చిలిపి పనుల్ని పట్టించుకోకూడదని పరోక్షంగా చెప్పుకొచ్చాడు.

Tags : Power Star, Pawan Kalyan, Nela Ticket Audio Launch, Ravi Teja

Write a comment ...
Post comment
Cancel