back

తమిళంలోకి వెళ్లనున్న పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా



Share via:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలకి తాత్కాలికంగా విరామం ఇచ్చినా... సినిమాల్లో తన క్రేజ్ ని మాత్రం ఇంకా కొనసాగిస్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే...

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ సినిమా 'అత్తారింటికి దారేది' ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు. అయితే ఈ సినిమా యొక్క తమిళ హక్కులను ప్రముఖ సంస్థ కొన్నట్టు సమాచారం.

ఈ అంతర్జాతీయ సంస్థ ప్రస్తుతం శంకర్ - రజినీకాంత్ - అక్షయ్ కుమార్లతో 450 కోట్లకు పైచిలుకు బడ్జెట్ తో రోబో సినిమాకి సీక్వెల్గా 2.0 ని నిర్మిస్తున్నారు. అవును ఎన్నో అద్బుత సినిమాలని తెరకెక్కించిన లైకా ప్రొడక్షన్స్ మన పవర్ స్టార్ సినిమాని కొనుగోలు చేసింది. ఇక ఇంతటి క్రేజీ సినిమాలో ఏ అరవ హీరో నటిస్తారో తెలియాల్సి ఉంది.

Tags : Power Star, Pawan Kalyan, Attharintiki Daaredi Tamil Rights

Write a comment ...
Post comment
Cancel