back

ఫోర్బ్స్ జాబీతాలో నెం.1 పవన్ కళ్యాణ్ ..!Share via:

ప్రతి సంవత్సరం అత్యంత ఎక్కువ సంపాదించే ప్రముఖుల పేర్లు అంతర్జాతీయ సంస్థ ఫోర్బ్స్ వెల్లడిస్తూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అలా వెల్లడించగా మన దేశంలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇందులో టాలీవుడ్ నుంచి నంబర్ వన్ స్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలవడం విశేషం.

సినిమాల నుంచి విరమించుకుని రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పటికీ పవన్ ఈ జాబితాలో టాలీవుడ్ నుంచి అగ్రస్థానాన నిలవడం విశేషమే. మొత్తంగా ఇండియాలో పవన్ స్థానం 24 కావడం విశేషం.

ఇక మిగతా హీరోల గురించి చూస్తే తమిళ్ హీరో విజయ్ 26 వ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ 28, విక్రమ్ 29,.. మహేష్ బాబు 33వ ర్యాంకులో ఉన్నాడు. సూర్య కు 34వ స్థానం దక్కింది. విజయ్ సేతుపతి 35.. అక్కినేని నాగార్జున 36.. కొరటాల శివ 39.. ధనుష్ 53.. సైనా నెహ్వాల్ 58.. అల్లు అర్జున్ 64.. నయనతార 69.. కమల్ హాసన్ 71 ర్యాంకుల్లో నిలిచారు. రామ్ చరణ్.. విజయ్ దేవరకొండ సమానంగా 72వ స్థానంలో ఉండటం విశేషం.

Tags : Pawan Kalyan, Forbes

Write a comment ...
Post comment
Cancel