back

మళ్ళి సినిమా చెయ్యబోతున్న పవన్ కళ్యాణ్?



Share via:

పూర్తిగా రాజకీయంలో నిమగ్నమైపోయిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... తిరిగి సినిమాలు తీయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.

అజ్ఞాతవాసి చిత్రం తరువాత పూర్తిగా రాజకీయంలో తిరుగుతున్న పవన్ ఒక చిత్రం చేయ్యబోతున్నట్టు సమాచారం.

ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మించబోతున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఎన్నికల ముందు ఎట్టి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాత బావిస్తున్నాడు. ఈ చిత్రానికి 'బాబీ' కానీ 'డాలీ' కానీ దర్శకత్వం వహించాబోతున్నట్టు తెలుస్తుంది.

పవన్ ఇంతకముందు బాబీ తో... 'సర్దార్ గబ్బర్ సింగ్' అలాగే డాలీ తో 'గోపాల గోపాల' 'కాటమరాయుడు' చేసాడు.

అయితే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో పాటు ఇంకొక మెగా హీరో నటించనున్నట్టు సమాచారం. వరుణ్ తేజ్ కానీ సాయి ధరం తేజ్ లో ఎవరో ఒకరు ఈ చిత్రం చేయ్యనున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలో పవన్ చాలా ముఖ్యమైన పాత్ర చేస్తున్నాడని, అది సెకండ్ హాఫ్ లో వస్తుందని సమాచారం. ఈ చిత్ర కథ రాజకీయాలకు సంబంధించిందని, పవన్ కు రాజకీయాలలో ఊతమివ్వాలన్న సంకల్పంతో ఈ చిత్రాన్ని తీస్తున్నట్టు చెబుతున్నారు.

ఈ సినిమా గురించి పూర్తిగా తెలియాలంటే ఇంకొన్ని రోజు వేచి చూడక మానదు!

Tags : Pawan Kalyan, Janasena Chief, New Movie

Write a comment ...
Post comment
Cancel