back

రంగస్థలం సక్సెస్ మీట్ లో కలుద్దాం - పవన్ కళ్యాణ్



Share via:

తన సినిమాలు తను చూసేందుకే అంతగా ఇష్టపడని పవన్ కళ్యాణ్, రాజకీయాల్లో బిజీగా ఉన్న ఈ సమయంలో ఒక సినిమా చూడడానికి సమయం వేచ్చిస్తాడా...? రంగస్థలం సినిమాకు తన భార్య అనా లెజ్నోవాతో కలిసి థియేటర్ కు రావడం విశేషం. బాబాయ్ కోసం సాయంత్రం స్పెషల్ షో ఏర్పాటు చేయించాడు రామ్ చరణ్. సినిమా యూనిట్ మొత్తం పాల్గొన్న ఈ షో లో, రాంచరణ్ మరియు సతిమని ఉపాసన కూడా పవన్ కళ్యాణ్ దంపతులతో పాటు సినిమా చూసారు. ఈ సినిమా చూసిన తర్వాత పవన్ మాట్లాడుతూ ..

‘‘తొలిప్రేమ తరవాత ఎందుకో రంగస్థలం సినిమా థియేటర్లో చూడాలని అనిపించింది. రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉంది. ప్రొడ్యూసర్స్ చాలామంచి సినిమా నిర్మించారు. డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే గొప్పగా ఉంది. వాస్తవికతకు చాలా దగ్గరగా ఉన్న సినిమా. నా మనసుకు నచ్చిన సినిమా ఇది. ఈ సినిమా గురించిన చాల చెప్పాలి కాని మిగతా విషయాలు సక్సెస్ మీట్ లో మాట్లాడదామని నిర్ణయించుకున్నా’’ అన్నారు.

రంగస్థలం సినిమాని ఫ్యామిలీతో కలిసి చుసిన పవన్ కళ్యాణ్

అంటే ఏ ఫంక్షన్స్ కి కూడా రావడం ఇష్టం లేని పవన్ కళ్యాణ్ రంగస్థలం సక్సెస్ మీట్ కి వస్తా అని చెప్పడం అంటే ఆయనికి ఈ సినిమా ఎంత నచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

Tags : Pawan Kalyan, Rangasthalam Success Meet, Ram Charan, Samantha, Sukumar, Rangasthalam Movie

Write a comment ...
Post comment
Cancel