back

సినిమాలకు సమయం లేదు - పవన్ కళ్యాణ్



Share via:

తన కొత్త సినిమా అంటూ గత వారం రోజులుగా పలు మాధ్యమాల్లో సంచరిస్తున్న వార్తల గురించి క్లారిటీ ఇచ్చేసారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

త్వరలో పవన్ కళ్యాణ్ సినిమా చేయనున్నట్టు, రాజకీయాంశాల కథతో ఓ కథ సిద్ధం చేయిస్తున్నారనీ కొన్ని మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి.

ఆ వార్తలేవీ నిజం కాదంటూ ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘‘నేను సినిమా చేయబోతున్నట్టు వచ్చిన వార్తలు నిజం కాదు. నేను ఏ సినిమాలోనూ నటించేందుకు అంగీకరించలేదు. సినిమాల్లో నటించేందుకు సమయం లేదు. పూర్తి సమయాన్ని ప్రజా జీవితానికి కేటాయించా. పజల్లోనే ఉంటూ... జన సైనికులు, అభిమానులతో కలిసి పాలకుల తప్పిదాలను బలంగా వినిపిస్తున్న తరుణమిది. సినిమాలపై దృష్టి సారించడం లేదు. నా ఆలోచనలు అన్నీ ప్రజాసంక్షేమం కోసమే, నా తపన అంతా సమసమాజ స్థాపన కోసమే’’ అని‌ పేర్కొన్నారు.

pawan kalyan press note on movies

Tags : Pawan Kalyan, Press Note, Movies

Write a comment ...
Post comment
Cancel