back

సంకల్పబలం లేని TDP అఖిలపక్ష సమావేశానికి మేము రాలేము - పవన్ కళ్యాణ్



Share via:

అఖిల పక్ష సమావేశం ఏర్పాటుకై ,TDP అధినేత చంద్రబాబు ఆలోచన తీరుని తీవ్రంగా విమర్శించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు..`ఏదైనా పనికి సంకల్పం బలంగా ఉంటే ఫలితం గొప్పగా ఉంటుందంటారు మన పెద్దలు. అటువంటి సంకల్పమే సీఎం చంద్రబాబు తలపెట్టిన అఖిలపక్షం సమావేశానికి లోపించింది. సోమవారం సంధ్య ముగిసేవేళ అనుకుని నిశి రాత్రి వేళ.. మంగళవారం సమావేశానికి రా..రమ్మని ఆయన అనుచరులతో కబురు పంపారు` అంటూ పవన్ ఎత్తిపొడిచారు. `తొలుత ఈ సమావేశం అఖిల సంఘాలకు మాత్రమే అని ప్రచారం చేసి - చివరికి పనిలో పనిగా రాజకీయ పార్టీలను కూడా కలిపేశారు.

ఈ సమావేశం నిర్వహణ కేవలం ' తెలుగుదేశం రాజకీయ ఎత్తుగడ ' గా జనసేన భావిస్తోంది. అందుకే దూరంగా ఉంటోంది. ప్రజలను వంచించే ఎటువంటి చర్యనైనా జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అందుకే ఈ సమావేశానికి దూరంగా ఉండాలని జనసేన నిర్ణయించుకుంది.` అంటూ తేల్చిచెప్పారు.

Tags : Janasena Party, Pawan Kalyan, All Party Meeting in AP

Write a comment ...
Post comment
Cancel