back

వైరల్ : పింక్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ లుక్



Share via:

చాలాకాలం తర్వాత వెండితెరపై తన అభిమానులను అలరించడానికి పవన్ వచ్చేస్తున్నారు. ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న పవన్ కళ్యాణ్ 26వ సినిమా షూటింగ్ మొదలైంది. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ అమితాబ్ బచ్చన్ చేసిన లాయర్ పాత్రను ఇక్కడ పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆ మధ్య ఓ సినీ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.

ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గుబురు గెడ్డంతో కనిపిస్తున్నారు. ఈ లుక్‌లోనే ‘పింక్’ రీమేక్‌లో కనిపించనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఆ రూమర్ ఇప్పుడు నిజమైంది. పవన్ కళ్యాణ్ నిజంగానే అదే లుక్‌‌తో ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫొటోల ద్వారా తెలుస్తోంది. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో గుబురు గెడ్బంతో ఉన్న పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ వెళ్తోన్న లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Tags : Pink remake, Pawan Kalyan, Dil Raju

Write a comment ...
Post comment
Cancel