back

పర్యావరణం - రాజకీయాలు పైన ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్



Share via:

నిన్ననే ప్రత్యేక హోదా మరియు విభజన హామీల అమలు పైన వామపక్షాలతో కలిసి విజయవాడలో పాదయాత్ర చేసిన జనసేనాని, ఈ రోజు పర్యావరణం మరియు రాజకీయాలను కలుపుతూ కొన్ని ట్వీట్స్ చేసాడు, వాటిలో అంతరార్ధం మాత్రం మోడీ , చంద్రబాబుల పాలన పైన విమర్శ గానే చెప్పుకోవచ్చు. ఆ ట్వీట్ల సారంశం ఏంటంటే ..

“వెలుగుతున్న ఇండియా బయట దేశాలను అలరిస్తుందే కానీ ఇండియాను కాదు. మన దేశ ఎకానమీ పెరుగుతూ ఉండవచ్చు ప్రపంచ వేదికపై ఇండియా మెరుస్తూ ఉండవచ్చు... కానీ రాజకీయ అవినీతి దేశానికి భవిష్యత్తు లేకుండా చేస్తోంది. రాజకీయ వ్యవస్థలో వ్యవస్థీకృతంగా పేరుకుపోయిన అవినీతి జాడ్యం దేశ సౌభాగ్యాన్ని దిగజార్చుతోంది. ప్రజల పట్ల వ్యవస్థ పట్ల రాజకీయనేతలకు ఎలాంటి పట్టింపులు లేకపోవడం విస్మయం. ఇది మన వ్యవస్థను నాశనం చేస్తోంది. ఎక్కడో ఎందుకు దేశ రాజధాని ఢిల్లీ మొదలుకొని మనకు కనీసం స్వచ్ఛమైన గాలి దొరకడం లేదు. ఉదాహరణకు చెప్పాలంటే... ఏపీలోని తుండూరు ఆక్వా పార్కును గమనిస్తే సరిపోతుంది. ఆ ప్రాంత యువకులు నాతో కలిసి తీవ్రమైన ఆవేదన వెలిబుచ్చారు. కనీసం స్వచ్ఛమైన గాలి నీరు కూడా మాకు లేకుండా చేస్తున్నారని వారు నా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.”

Tags : Pawan Kalyan Latest Tweets, Pawan Kalyan on Chandra Babu Naidu, Pawan Kalyan On Narendra Modi, Janasena Party

Write a comment ...
Post comment
Cancel