back

ఇతర పక్షాల్లో గుబులు పుట్టిస్తున్న పవన్ పర్యటన



Share via:

శ్రీకాకుళం జిల్లాతో మొదలెట్టి జనసేనాని పవన్ కళ్యాణ్ చేస్తున్న జనసేన పోరాట యాత్ర దిగ్విజయంగా శ్రీకాకుళం జిల్లాని దాటుకుని విజయనగరం జిల్లాలో కొనసాగుతుంది. ఈ యాత్రలో భాగంగా శ్రీకాకుళంలోని అన్ని నియోజకవర్గాలను చుట్టేసిన పవన్ వీలైన చోట్ల కవాతులు, సభలు, కార్యకర్తల సమావేశం చేస్తూ తన పోరాట యాత్రని సాగించారు. అయితే ఈ యాత్రల్లో కేవలం వచ్చిన జనాలకి సినిమా డైలాగ్స్ చెప్పి పంపకుండా స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ జనాల కోసం తపిస్తూ తన విలక్షణమైన రాజకీయ శైలిని చూపించారు పవన్. ఇదే ఇక్కడ చిక్కుగా తయారైంది ఇతర పక్షాలకు.

ఫొటోస్: జనసేన పోరాట యాత్ర

పవన్ లేవనెత్తిన కొన్ని ముఖ్యాంశాలు :

ఇప్పుడు ఇవన్ని స్టేట్ లెవెల్ టాపిక్స్ అయిపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మహానాడు అయిన వెంటనే శ్రీకాకుళం జిల్లా నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యల పరిష్కారం, పవన్ యాత్రకి జనాల స్పందన వంటి వాటి పైన సుదీర్గంగా చర్చించారు. ఇదే సమయంలో 170 రోజుల నుంచి పాదయాత్ర లో ఉన్న జగన్ కి కూడా వాళ్ళ పార్టీ శ్రేణులు పవన్ కళ్యాణ్ ప్రభావం పైన ఎప్పటికపుడు వార్తలు మొస్తూ ఉన్నాయి. జగన్ కూడా వారి శ్రీకాకుళం నాయకులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పవన్ లేవనెత్తిన సమస్యల పైన పోరాటం చేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని నిర్ణయించారు. కాని ఎక్కడో వాళ్ళకి కూడా మొదట ఈ సమస్యలను పవన్ లేవనెత్తాడు కనుక ఎటువంటి మేలు జరిగినా అది ఆయన ఖాతాలోకి పోతుందనే భయం వెంటాడుతుంది.

ఇవే కాక తెలుగుదేశం మరియు వైసిపి లో ఎక్కడ వాళ్ళ నాయకులు జనసేన వైపు అడుగులు వేస్తారా అనే భయం కూడా ఉంది. బయటికి చెప్పకపోయినా చాల మంది ఉత్తరాంధ్ర నాయకులు జనసేన తో టచ్ లో ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే.. పది రోజులకే పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇంత అలజడి సృష్టిస్తే ఇక వచ్చే రోజులు ఎలా ఉంటాయో అని సామాన్య ప్రజలు చర్చితున్నారు.

ఫొటోస్: జనసేన పోరాట యాత్ర

Tags : Pawan Kalyan, Janasena Party, Janasena Porata Yatra, TDP, YCP, Srikakulam District

Write a comment ...
Post comment
Cancel