back

సిగ్గు లేకుండా నటించడం రవితేజకే సాధ్యం - పవన్ కళ్యాణ్



Share via:

తన సినిమా ఫంక్షన్స్ కే మొక్కుబడిగా వచ్చే పవన్ కళ్యాణ్ ఈ మధ్య రూటు మార్చాడు. మొన్నరంగస్థలం సక్సెస్ మీట్ కి వచ్చినప్పుడు, చరణ్ మీద ప్రేమతో వచ్చాదులే అనుకున్నారు అంతా, కాని నిన్న ఒకేరోజు రెండు సినిమా ఫంక్షన్స్ కి అటెండ్ అయ్యి అందరిని ఆశ్చర్యపరిచాడు. అందులో ఒకటి బన్నీ నా పేరు సూర్య ది అయితే .. ఇంకోటి రవితేజ నటించిన నెల టికెట్ వేడుక. అయితే పవన్ కళ్యాణ్ రవితేజ గురించి కొన్ని ఆసక్తికర వ్యాక్యాలు చేసారు ...అవి
“రవితేజ అంటే చాలా ఇష్టం. ‘ఆజ్‌ కా గుండారాజ్‌’ ప్రివ్యూ మద్రాస్‌లో చూస్తున్నప్పుడు ఆయన్ని తొలిసారి చూశా. ఆయన నవ్వు, నటన వెనుక చాలా తపన, కష్టం, కృషి, చెప్పలేని బాధలు కనిపిస్తాయి. ఎక్కడా ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా తట్టుకుని నిలబడి ఈ స్థాయికొచ్చారు. ఆయన్ని చూస్తున్నప్పుడు సిగ్గులేకుండా ఎలా నటిస్తాడు? అనిపిస్తుంటుంది. సిగ్గొదిలేసి నటించడానికి పారిపోతుంటా. కానీ రవితేజని చూస్తుంటే మాత్రం సిగ్గు అనే పదాన్ని ఇంట్లో పెట్టేసి బయటకు వస్తారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా” అని అన్నారు.

Tags : Power Star, Pawan Kalyan, Nela Ticket Audio Launch

Write a comment ...
Post comment
Cancel