back

పెద్దోల్లయిపోయిన పవర్ స్టార్ పిల్లలు



Share via:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి నలుగురు పిల్లలు. అందులో ఇద్దరు పవన్ - రేణు దేశాయ్ పిల్లలు కాగా ఇద్దరు పవన్ - అన్నా లేజ్నోవా పిల్లలు. పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ లు విడాకులు తీసుకున్న తర్వాత వారి పిల్లలైన అఖీరా - ఆద్యాలు తల్లి రేణు వద్దే పెరుగుతున్న విషయం తెల్సిందే. పిల్లల విషయంలో పవన్ కళ్యాణ్ కూడా జాగ్రత్తలు తీసుకోవడం, వారికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నాడు. వీలైనప్పుడల్లా పిల్లల దగ్గరికి వెళ్లి రావడం పవన్ కి అలావాటే, అలాగే వాళ్లకి కావాల్సినవన్నీ చూసుకుంటూ ఉంటాడు. ఈ మధ్య అకీరా - ఆద్యల ఫొటోస్ ఏవి బయటికి రాలేదు. అయితే చాలా నెలల తర్వాత రేణు దేశాయ్ తాజాగా పిల్లలు ఫోటో పోస్ట్ చేసింది. దాంతో పవన్ ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 14 ఏళ్ల అఖీరా - 10 ఏళ్ల ఆద్యలు పెద్ద వారయ్యారని ఈ ఫోటోకి కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు ఫాన్స్ అయితే ఇంకా ముందుకు పోయి అప్పుడే జూనియర్ పవర్ స్టార్ అంటూ బిరుదులు కుడా ఇస్తున్నారు. చాలా రోజుల తర్వాత వచ్చిన పిక్ అవ్వడంతో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

adhya and akira nandan latest photos

Tags : Pawan Kalyan, Akira Nandan, Aadhya, Renu Desai

Write a comment ...
Post comment
Cancel