back

సైరా టీజర్ పైన పవన్ కళ్యాణ్ రియాక్షన్ !



Share via:

నిన్న సాయంత్రం శిల్పకలావేదికలో మెగా అభిమానుల మధ్య జరిగిన మెగాస్టార్ చిరంజీవి గారి 63వ జన్మదిన వేడుకలలో రాంచరణ్ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అందులో సైరా టీజర్ చూసిన పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఏంటో తెలిపారు, అవి రాంచరణ్ మాటల్లోనే ....
“ఉదయం 10.45 నిమిషాలకు తన దగ్గరికి టీజర్ వచ్చిందని.. దాన్ని వెంటనే వాట్సాప్ ద్వారా పవన్ బాబాయికి పంపానని చరణ్ తెలిపాడు. పది నిమిషాల తర్వాత పవన్ నుంచి రిప్లై వచ్చిందని - టీజర్ అదిరిపోయిందని.. థియేటర్లో ఎప్పుడెప్పుడూ సినిమా చూద్దామా - అని ఎదురు చూస్తున్నానని పవన్ అన్నాడని చరణ్ చెప్పాడు. ఇది అభిమానుల్ని ఉత్సాహపరచడానికి ఊరికే అంటున్న మాట కాదని.. ఇది వాస్తవం అని చరణ్ తెలిపాడు”.

Tags : Pawan Kalyan About Sye Raa Narasimha Reddy Teaser, Megastar Chiranjeevi, Syeraa Teaser

Write a comment ...
Post comment
Cancel