back

మన సత్తా డిల్లీకి చాటుదాం @ ధవళేస్వరం - పవన్ కళ్యాణ్



Share via:

శనివారం రోజు  విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా నేతలు, కార్యకర్తలతో జనసేనాని పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఈ నెల 15వ తేదిన తలపెట్టిన ధవళేశ్వరం కవాతు తర్వాత దేశం మొత్తం జనసేన గురించే మాట్లాడుకోవాలి. ఏం చేస్తారో చేయండి. కవాతుకి అందరూ సహకరించండి.” అని పిలుపునిచ్చారు.

పోలీసు శాఖ అనుమతి నిరాకరించడంతో 6వ తేదిన రాజమండ్రి బ్రిడ్గి పైన తలపెట్టిన కవాతు కార్యక్రమం విరమించబడింది. ఇప్పుడు లక్షల మంది జనసైనికులతో అదే కవాతును ధవళేస్వరం బ్యారేజి పైన 15వ తేదిన చేయాలనీ పవన్ కళ్యాణ్ నిర్ణయించాడు. జనసేనకి ఆయువుపట్టు లాంటి గోదావరి జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తలతో తమ బలమెంతో డిల్లీకి చూపించాలని పవన్ అందరిని ఆదేశించారు. మరి పవన్ అనుకున్న ప్రకారం జరుగుతుందా లేదా అనేది గోదావరి జిల్లా జనసైనికుల చేతిలోనే ఉంది.

Tags : Janasena Chief, Pawan Kalyan, Dhawaleswaram March

Write a comment ...
Post comment
Cancel