back

పవన్ కళ్యాణ్ గుణాన్నిఅద్భుతంగా వర్ణించిన ఒక అభిమాని ....|| మస్ట్ రీడ్



Share via:

పవన్ కళ్యాణ్ మాటల పైన మరియు కొన్ని విషయాలలో ఆయన మౌనం పైన మీడియా ద్వారా జరుగుతున్న కుత్రపూరితమైన విమర్సల పర్వం పై ఒక పవన్ అభిమాని అద్భుత విశ్లేషణ .....

“సొంత అక్కని రోడ్డు మీద కామెంట్ చేస్తే చూసి పసి వయ్యస్సులోనే పళ్ళు కొరికినోడివి...
సమాజంలో అన్యాయం చూసి ఓర్వలేక చిన్నప్పుడే అడివిలోకి పారిపోదాం అనుకున్నోడివి...
తోటి నటుడికి అన్యాయం జరిగితే రోడ్డు మీదకొచ్చి తనకి మద్దతుగా నిలబడినోడివి...
కుటుంబంలో సమస్యలు వస్తే... తుపాకీ తిరిగిచ్చేసి అసహనం వ్యక్తం చేసినోడివి...
అన్న అభిప్రాయాలు... సిద్ధాంతం పరంగా నీ వ్యక్తిత్వానికి సరిపడటం లేదని దూరం జరిగినోడివి...

ఇప్పుడు మాత్రం...
ప్రజల కోసం ఎన్ని తిట్లను భరిస్తున్నావ్...
ఎన్ని అవమానాలు దిగమింగుతున్నావ్...”

సినిమాలు & యాడ్లు చేసుకుంటూ సంవత్సరానికి 200 కోట్లు సంపాదించుకుని మిగిలిన నటుల్లా ఏసీ రూముల్లో...

మాలాంటి ప్రజల చమట కంపుకి & ఈ మట్టి వాసనకు దూరంగా అద్దాల మెడల్లో గడిపేయగల స్ధోమత ఉండి కూడా...

నీ భిక్షతో సీఎం పదవి పొందినోడు దగ్గర నుండి & రోడ్లు మీద తిరిగే వేశ్య వరకు అందరితో మాటలు పడుతున్నావ్...

ఈ ప్రజలకు & ఈ సమాజానికి ఎదో మంచి చెయ్యాలని అని తపనతో... భూదేవికి ఉన్నంత ఓర్పుని నువ్వు చూపిస్తున్నావ్...

ప్రజలంటే ప్రేమ...దేశం అంటే పిచ్చి... సమాజం పట్ల ఓ ఉద్వేగం ఉన్న నీలాంటోడు రాష్ట్రానికి ఒక్కడున్న చాలు మా జీవితాలు బాగుపడతాయి అని మేము నమ్ముతున్నాం... నీతో కలిసి నడుస్తున్నాం...
జై జనసేన...

- జానీ కామిశెట్టి

Tags : Power Star, Pawan Kalyan, Janasena Party, Johnny Kamisetty, Politics

Write a comment ...
Post comment
Cancel