back

గోదావరి వంతెన పై పవన్ vs జగన్...



Share via:

పశ్చిమ గోదావరి నుంచి తూర్పు గోదావరి లోకి వెళ్ళాలంటే ఉన్నముఖ్య మార్గం.. కొవ్వూరు - రాజమండ్రి మధ్యన గోదావరి నది పైన ఉన్న రోడ్ కం రైల్వే బ్రిడ్జి. ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ వెంట జనం పోటెత్తారు. చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేనంత జనం.. ఈ సందర్భంగా గోదారిపై కన్పించారు. వంతెన పైనే కాక కింద గోదావరిలో పడవలతో కూడా జనాలు హల్చల్ చేసారు.

ఇప్పుడు అదే గోదావరి వంతెన పైకి జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజపోరాట యాత్ర రానుంది.  'జనసేన కవాతు' పేరుతో కొవ్వూరు నుంచి రాజమండ్రి వరకు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిపై జనసంద్రాన్ని చూపించాలనీ.. అదీ ప్రజాసంకల్ప యాత్రను మించిన జనసందోహాన్ని సమీకరించాలనీ జనసేన శ్రేణులు ప్రయత్నాల్లో తలమునకలైపోయాయి. అంతగా గ్రౌండ్ లెవెల్లో లేని జనసేన పార్టీ దీని కోసం పవన్ చరిష్మ మరియు ఆయన అభిమానులనే నమ్ముకుంది. మరి ఈ పోటి లో జగన్ ని పవన్ అధిగామిస్తాడో లేదో చూడాలి.

Tags : Pawan Kalyan, YS Jaganmohan Reddy, Janasena, YSRCP

Write a comment ...
Post comment
Cancel