back

ఫ్లెక్షిలు కడుతూ మృతి చెందిన పవన్ అభిమానులకు మా నివాళి



Share via:

జనసేన పోరాట యత్ర లో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాకపట్టణం జిల్లాలోని గిరిజిన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. బుధవారం జిల్లాలోని పాయకరావుపేటలో పర్యటించనున్నారు. అయితే... తమ అభిమాన హీరో రాకను పురస్కరించుకుని తోళెం నాగరాజు (28), భీమవరపు శివ (31) అనే ఇద్దరు యువకులు సాయిమహల్ జంక్షన్ దగ్గర స్వాగత ఫ్లెక్సీలు కట్టేందుకు ఏర్పాట్లు చేశారు. ఫ్లెక్సీలను రహదారి పక్కన కడుతుండగా పక్కనే ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో వారు షాక్‌కు గురై మృతి చెందారు. ఇద్దరు యువకుల మృతితో పాయకరావుపేటలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ యువకులను పోగొట్టుకున్న కుటుంబాలకు మా ప్రాఘాడ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. ఇటువంటివి చేసే ముందు మీ కుటుంభం గురించి అలోచించి కొంత జాగ్రత్తలు పాటించాలని అందరిని కోరుతున్నాం.

Tags : Pawan Fans, Janasena Party, Janasena Porata Yatra, Payakaraopeta

Write a comment ...
Post comment
Cancel