back

జనతా గ్యారేజ్ రికార్డ్స్ బద్దలు... రాంచరణ్ పై ఎన్టీఆర్ ప్రశంసలు..



Share via:

రాంచరణ్ నటించిన తాజా సంచలనం, రంగస్థలం చిత్రం బాక్స్ఆఫీస్ పై దండయాత్ర కొనసాగిస్తోంది. వీకెండ్ ముగిసే సమయానికి రంగస్థలం చిత్రం ట్రేడ్ విశ్లేషకులని సైతం షాక్ కి గురిచేసేలా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

రంగస్థలం చిత్రం పై ప్రముఖుల నుండి ప్రశంసలు కురుస్తున్నాయి. రాంచరణ్ నటనకు అంతా నీరాజనం పడుతున్నారు. త్వరలో రాంచరణ్ తో కలసి నటించబోతున్న ఎన్టీఆర్, రంగస్థలం చిత్రంపై స్పందించాడు. తాజాగా రంగస్థలంను చూసిన తరువాత జూనియర్ ఎన్టీఆర్ ఆ చిత్రబృందాన్ని, ముఖ్యంగా రాంచరణ్ ని పొగడ్తలతో ముంచెత్తాడు. ఆయన ట్విట్టర్లో స్పందిస్తూ -
"ఇప్పుడే రంగస్థలం చూశాను. నీకు హ్యాట్సాఫ్ చరణ్. సినిమాలోని నీ నటనకు నీకు వస్తున్న ప్రశంసలకు నీవు నిజంగా అర్హుడివే. నా ప్రశంస కూడా తీసుకో. నీకంటే ఎవరూ కూడా బాగా నటించలేరు చిట్టి బాబు క్యారెక్టర్ లో " అంటూ తన ట్విట్టర్లో పేర్కొన్నాడు..

ఎన్టీఆర్ దర్శకుడు సుకుమార్ పై కూడా ప్రశంసలు కురిపించాడు... "ఇలాంటి కథ తెరకెక్కించాలని ధైర్యం కావాలని, సుకుమార్ బ్రిలియంట్ డైరెక్షన్ తనని ఆశ్చర్య పరిచిందని ఎన్టీఆర్ తెలిపాడు. సమంత, దేవిశ్రీ ప్రసాద్ మరియు నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ పై కూడా ఎన్టీఆర్ ప్రశంసలు అందించాడు."

ntr ram charan sukumar

రంగస్థలం సృష్టిస్తున్న ప్రభ౦జననికి పలు సినిమాల రికార్డ్స్ తుడిచి పెట్టుకు పోతున్నాయి, ఇప్పటికే ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ఫుల్ రన్ లో వచ్చిన కలెక్షన్స్ ని 3 రోజుల్లోనే దాటేసింది అంటూ వార్తలు విన్పిస్తున్నాయి. అలాంటి పరిస్థితిలో ఎన్టీఆర్ ట్విట్ పెట్టడం ప్రాధన్యత సంతరించుకుంది. .!

మెగాస్టార్ చిరు ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్లుగా తనకు ఖైదీ చిత్రం తరహాలో రాంచరణ్ కు రంగస్థలం చిత్రం అవుతుంది అనే మాటలు నిజమయ్యాయి. రంగస్థలంలో రాంచరణ్ నటనకు బ్రహ్మరధం పడుతున్నారు.

రంగస్థలం 4 రోజుల కలెక్షన్లు...

Tags : NTR on Ram Charan, NTR on Rangasthalam, Jr. NTR, Mega Power Star, Ram Charan, NTR tweets on Ram Charan & Rangasthalam

Write a comment ...
Post comment
Cancel