back

రాంచరణ్ మంచోడు అంటున్న ఎన్టీఅర్ ఫాన్స్



Share via:

మొన్న నవంబర్ 11వ తేదిన రాజమౌళి - రాంచరణ్ - రామారావు (ఎన్టీఆర్) ల కాంబో లో రాబోతున్న సినిమా RRR ప్రారంబోత్సవ వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఆ వేడుకకి వచ్చిన అతిధులతో సినిమా యూనిట్ అంతా ఎంత సందడిగా గడిపిందో మనం వీడియోలో చూసాం. కాని ఆ వీడియోలోని ఒక సంఘటనే ఇప్పుడు ఎన్టీఅర్ అభిమానులందరిని రాంచరణ్ కి కూడా అభిమానులను చేసింది.

వీడియో: RRR ముహూర్తం వేడుక

తమ ఇద్దరిలో ఎవరూ ఎక్కువ - తక్కువ కాదు అని చాటి చెబుతూ చరణ్ ప్రారంభోత్సవంలో చేసిన ఒక పని మాత్రం అభినందనీయం. అయ్యప్ప మాలలో ఉన్న చరణ్ ను పూజ సందర్భంగా కొబ్బరి కాయ కొట్టమని పండితులు అతడి చేతికిస్తే.. కొంచెం దూరంగా ఉన్న తారక్ దగ్గరికెళ్లి అతడి చేతిని కొబ్బరికాయకు ముట్టించి.. ఆ తర్వాత వచ్చి కాయ కొట్టాడు. దీంతో రామ్ చరణ్ సంస్కారాన్ని అందరూ పొగిడేస్తున్నారు.

హరికృష్ణ మరణించి ఇంకా సంవత్సరం పూర్తి కాకపోవడం వళ్ళ తారక్ పూజకి దూరంగా ఉండగా చరణ్ ఇలా తారక్ ని కూడా పూజలో భాగం చేయడం తారక్ ఫాన్స్ అందరికీ చాల నచ్చేసింది. ఇదే విధంగా సినిమా విషయంలో కూడా ఇద్దరూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తే ‘ఆర్ ఆర్ ఆర్’ తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిలా నిలిచిపోవడం ఖాయం. నవంబరు 19న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న సంగతి తెలిసిందే.

Tags : RRR Massive Launch, NTR Fans, Ram Charan, Rajamouli, RRR Movie

Write a comment ...
Post comment
Cancel