back

రాంచరణ్ తో ఛాలెంజ్ చేస్తున్న ఎన్టిఆర్



Share via:

ఎన్టిఆర్ రాంచరణ్ లు ఎంత మంచి స్నేహితులు అనేది మనందరికీ తెలిసిందే.. ఇప్పుడు అదే ఎన్టిఆర్ ఒక ఛాలెంజ్ ని రామచరణ్ కి విసిరాడు. ఇదంతా ఏంటి అంటే ...
గత కొంత కాలంగా దేశంలోని ముఖ్యులు అందరిని ఒక సోషల్ మీడియా ఛాలెంజ్ వెంటాడుతుంది... అదే "హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్" అంటే నేను ఫిట్ గ ఉంటె దేశం ఫిట్ గ ఉంటుంది అని. ఈ మధ్యనే విరాట్ కోహ్లి కూడా ఇదే ఛాలెంజ్ ని తన భార్య అనుష్క కి మరియు ప్రధాని మోడీ కి చేసారు. అలాగే మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ ఛాలెంజ్ ని మన ఎన్టిఆర్ కి చేసారు.

ఇకపోతే మోహన్ లాల్ విసిరిన ఛాలెంజ్ కి తారక్ గట్టి రీప్లై ఇచ్చాడని చెప్పాలి. కష్టపడి రోజు చేసే వర్కౌట్ ట్రైనర్ స్టీవెన్ తో చేస్తున్నట్లు వివరించిన ఎన్టీఆర్ అదే తరహాలో మరికొంత మందికి ఛాలెంజ్ విసిరాడు. ఇప్పుడు నందమూరి కళ్యాణ్ - మహేష్ బాబు - రాంచరణ్ - రాజమౌళి - కొరటాల శివ.. అందరికి నా ఛాలెంజ్.. అని తారక్ వారిని ట్యాగ్ చేసి ట్వీట్ చేశాడు. ఇక రాంచరణ్ కి ట్విట్టర్ ఎకౌంట్ లేదు కాబట్టి ఆయాన సతీమణి ఉపాసనని ట్యాగ్ చేస్తూ.. దయచేసి చరన్ కు తెలియజేయండి అని తారక్ ట్వీట్ పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ అవుతోంది. మరి వారందరి నుంచి ఎంత స్ట్రాంగ్ గా రీప్లై వస్తుందో చూడాలి.

Tags : NTR, Ram Charan, Hum Fit Toh India Fit

Write a comment ...
Post comment
Cancel