గత పది సంవత్సరాల నుంచి రాజకీయాలని పరిశీలిస్తే గట్టి గట్టి అరవడం, తిట్టడం , బూతులు మాట్లాడడమే రాజకీయ చర్చల్లో కనిపిస్తోంది. అందులోనూ మహిళా నాయకులుగా చెప్పుకునే వాళ్ళు తక్కువేమీ కాదు. ఈ మధ్య అది స్తుతి మించుతోంది. ఒక పార్టీ లోని మహిళా నాయకురాలు ఏదైనా తప్పుగా మాట్లడితే వెంటనే ఆవతలి పార్టీ లోని మహిళా నాయకురాలు వ్యగ్తిగతంగా దూషించడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకే న్యూస్ చానల్స్ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం శోచనీయం. అయితే రాజకీయాల్లో పెను మార్పు కోసం పనిచేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ తన పార్టీ జనసేనకి ఇలాంటి మహిళా నాయకులు వద్దు అంటున్నారు.. మరి ఆయన ఏమ్మనారంటే
మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది అని,ఒక పక్క వారి వైవాహిక జీవితాన్ని చూసుకుంటూనే రాజకీయాల్లో కూడా ఎంతో విలువలతో కూడిన రాజకీయాలు చేసినటువంటి సరోజిని నాయుడు లాంటి ఆడవారు రాజకీయాల్లోకి రావాలని పవన్ తెలిపారు. కానీ ఇప్పుడున్న మహిళా నేతల్లో అలాంటి వారు ఒక్కరు కూడా లేరని విలువలతో కూడిన రాజకీయాలను వదిలేసి మీడియాల్లో నోరులేసుకొని పడిపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతే కాకుండా మరికొంత మంది మహిళలేమో బూతులు మాట్లాడుతారని అలాంటి మాటలు మాట్లాడే మహిళా రాజకీయ నాయకులు జనసేన పార్టీకి అవసరం లేదని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసారు.
Tags : Pawan Kalyan, Janasenani, Jana Sena Party