back

మెగా ప్రిన్సెస్ నిహారిక పెళ్లి ముహూర్తం ఖరారు



Share via:

డిసెంబ‌ర్ 9న రాత్రి 7.15 గంట‌ల‌కు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌య నిహారిక, చైత‌న్య ల వివాహానికి ముహూర్తం ఖ‌రారైంది. ఈ విష‌యాన్ని వ‌రుడి తండ్రి, గుంటూరు ఐజీ జె.ప్ర‌భాక‌ర్‌రావు తెలిపారు.క‌లియుగ దైవం శ్రీవారి దర్శనం కోసం ప్రభాకర రావు దంపతులు బుధ‌వారం తిరుమ‌ల వెళ్లారు.స్వామి వారి సేవలో పాల్గొ న్నారు. ఈ సంద‌ర్భంగా నిహారిక‌, చైత‌న్య వివాహ పత్రికను స్వామి వారి చెంత ఉంచి, ఆశీర్వచనం తీసుకున్నారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న వివాహ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఉదయపూర్‌లో ఉన్న ఉదయ్ విలాస్‌ను వివాహ వేదికగా ఖరారు చేసినట్లు చెప్పారు.

Tags : Niharika konidela, Chaitanya, Nagababu, varuntej

Write a comment ...
Post comment
Cancel