back

నిహారిక కాబోయే భర్త ఎవరంటే ?



Share via:

మెగా ప్రిన్సెస్ నిహారిక వివాహం గురించి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీతో పాటు, సోషల్ మీడియా లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇటీవలే ఇందుకు సంబంధించి నిహారిక చిన్న క్లూ ఇవ్వడం సహా.. కాబోయే వ్యక్తితో దిగిన ఓ ఫొటోను ఇన్​స్టాలో పంచుకుంది. అయితే ఆ వ్యక్తి ముఖం మాత్రం కనపడకుండా అటువైపు తిప్పి ఉండటం వల్ల ఎవరై ఉంటారా? అని మెగా అభిమానులంతా నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో మరో పోస్ట్ పెట్టిన నిహారిక అతనెవరో రివీల్​ చేసింది.

అబ్బాయి ఎవరంటే ?

గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కొడుకు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లి చేసుకోనుంది. ఇండియన్ స్కూల్ బిజినెస్‌లో ఎంబీఏ పూర్తిచేసిన చైతన్య.. హైదరాబాద్‌లోని ఓ ఎంఎన్‌సీ కంపెనీలో ఉన్నత పదవిలో ఉన్నట్టు సమాచారం. ఇకపోతే నిహారిక- చైతన్యల నిశ్చితార్థం ఈ ఏడాది ఆగస్టులో, అదేవిధంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరగనుందని మెగా సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

ఫొటోస్ : నిహారిక , వెంకట్ చైతన్య ఫోటోషూట్

Tags : Niharika Konidela, Venkat Chaitanya, Nagababu, Varun Tej

Write a comment ...
Post comment
Cancel