back

సైరా లో నిహారిక , తమన్నా పాత్రలు ఇవేనా..?



Share via:

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం శరవేగంగా తెరకెక్కుతుంది. కాగా ఈ చిత్రంలో కొణిదెల నిహారిక మరియు మిల్క్ బ్యూటీ తమన్నా కూడా కీలక పాత్రలలో నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే పాత్రల్ర గురించి తాజాగా ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ తెలిసింది.


ఓ గిరిజన యువతిగా కనిపించనున్న నిహారిక రెండు సీన్స్ లో కనిపిస్తోందట. అయితే ‘సైరా నరసింహారెడ్డి’కి ఓ ఆపద సమయంలో ఆశ్రయం ఇచ్చే యువతిగా నిహారిక నటిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే నిహారికకు సంబధించిన సీన్స్ ను షూట్ చేసారు.

తమన్నా సైరాలో లక్ష్మి అనే ఓ సంప్రదాయ నృత్యకారిణిగా నటిస్తోందట. పైగా తమన్నా పోషిస్తోన్న లక్ష్మి పాత్రకు దేశభక్తి చాలా ఎక్కువట. ఆమెకు సంబంధించిన ఓ ఎమోషనల్ సన్నివేశం బాగా ఆకట్టుకుంటుందని తెలుస్తోంది.

ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేదీ ఈ చిత్రానికి మ్యూజిక్ ను అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Tags : Syeraa, Tamannah, Nayanthara, Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel