back

నిహారిక తో సినిమా తీస్తున్న సుకుమార్..!



Share via:

రంగస్థలం సినిమా భారీ విజయం సాధించి 10 నెలలు అవుతున్న ఆ చిత్ర దర్శకుడు సుకుమార్ తన తర్వాతి సినిమాని స్టార్ట్ చేయలేదు. మహేష్ తో సినిమా అని అన్నారే తప్పితే దాని గురించి ఎటువంటి క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు ఆశక్తికర వార్త ఒకటి సినిమా ప్రపంచంలో చక్కర్లు కొడుతుంది అదే సుకుమార్ మెగా ప్రిన్సెస్ నిహారిక తో సినిమా తీస్తున్నాడని. అయితే దర్శకుడిగా కాదు నిర్మాతగా అని వార్త.


ప్రస్తుతం సుకుమార్ తన బ్యానర్ లో రెండు సినిమాలను మైత్రి మూవీస్ మరియు శరత్ మరార్ తో కలిసి నిర్మిస్తున్నాడు. ఒక వైపు అవి తెరకెక్కుతున్నాయి. మరో వైపు సుకుమార్ కొత్త ప్రాజెక్ట్ ను మొదలు పెట్టబోతున్నాడు. నిహారిక కోసం ఒక లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ ను సుకుమార్ సిద్దం చేశాడట. తన శిష్యుడితో ఆ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. సుకుమార్ రైటింగ్స్ తో కలిసి గీతాఆర్ట్స్ 2 మరియు అంజనా ప్రొడక్షన్స్ నిహారిక మూవీని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

ప్రస్తుతం నిహారిక 'సూర్యకాంతం' అనే చిత్రాన్ని చేస్తోంది. ఆ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా విడుదలకు ముందే ఈ కాంబో వెంచర్ పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. నిర్మాతగా సరేకాని దర్శకుడిగా సినిమా ఎప్పుడుంటుందో చూడాలి.

Tags : Niharika, Sukumar, Rangasthalam

Write a comment ...
Post comment
Cancel