back

#RRR ది పునర్జన్మ స్టొరీనా ?



Share via:

దర్శకధీరుడు రాజమౌళి రాంచరణ్-ఎన్టీఆర్ ల కాంబోలో తెరకెక్కిస్తున్న ‘RRR’ సినిమా కథపై ఎన్నో ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. ఈ భారీ బడ్జెట్ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోందని ఒక కథనం.. పిరియాడికల్ మూవీగా తెరకెక్కుతోందని.. స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో రూపొందుతోందని ఓ కథనం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బందిపోటుగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోలీసు అధికారిగా నటిస్తున్నారని మరో కథనం వినిపిస్తోంది.

 

అయితే తాజాగా మరో ఆసక్తికర కథ ఒకటి వినిపిస్తుంది. మగధీర తరహాలో ఈ ‘RRR’లో కుడా ముఖ్య పాత్రలు అయిన తారక్, చెర్రీ చనిపోతారట.. స్వాతంత్ర్య పోరాట సమయంలో జరిగే భీకర పోరులో వీరిద్దరూ చనిపోయి... అనంతరం వీరిద్దరూ మళ్లీ జన్మిస్తారని.. 2000 సంవత్సరంలో తిరిగి ప్రాణ స్నేహితులుగా మారతారంటూ ఒక కథ సోషల్ మీడియా లో హల్‌చల్ చేస్తోంది.


ఇప్పటివరకు రూపొందిన సినిమా సెట్స్ ని బట్టి ఈ కథ బాగా సెట్ అయ్యేలా ఉంది. మరి పునర్జన్మ నేపథ్యంలో మగధీర తో ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టిన రాజమౌళి మరోసారి అదే బ్యాక్ డ్రాప్ లో తీసే ? ఈ సినిమా కూడా బాహుబలి రేంజ్ ని తగులుతుందేమో చూడాలి. అయితే దానికి మనం 2020 వరకు వెయిట్ చేయాల్సిందే..

Tags : RRR Story Updates, Ram Charan, NTR, Rajamouli

Write a comment ...
Post comment
Cancel